భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఆగస్టు 15న అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద మువ్వన్నెల జెండా రెపరెపలాడనుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్‌కు చెందిన ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
టైమ్స్ స్క్వేర్ వద్ద రెపరెపలాడనున్న మువ్వన్నెల జెండా - amrica latest news
స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా.. ఈ ఆగస్టు 15న అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద త్రివర్ణ పతాకం రెపరెపలాడనుంది. ఈ ఘనతతో.. తాము కొత్త చరిత్ర లిఖించినున్నట్లు అమెరికాలోని భారతీయ కూటముల సమాఖ్య తెలిపింది.
![టైమ్స్ స్క్వేర్ వద్ద రెపరెపలాడనున్న మువ్వన్నెల జెండా In a first, Indian tricolour to be hoisted at iconic Times Square in New York](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8372546-801-8372546-1597106215314.jpg)
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో రెపరెపలాడనున్న మువ్వన్నెల జెండా
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ చరిత్రలో భారతీయ జాతీయ జెండా రెపరెపలాడనుండడం ఇదే ప్రథమం కాగా.. తాము కొత్త చరిత్ర లిఖించినున్నట్లు అమెరికాలోని భారతీయ కూటముల సమాఖ్య(ఎఫ్ఐఏ)తెలిపింది. ఆగస్టు 14న ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ దీపకాంత ధగధగలతో వెలిగిపోనుంది.