అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) (IMF news) ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ తన విధుల నుంచి వచ్చే ఏడాది జనవరిలో తప్పుకోనున్నారు. గతంలో పని చేసిన హార్వర్డ్ యూనివర్సిటీకే ఆమె తిరిగి వెళ్లనున్నారు. ఈ మేరకు ఐఎంఎఫ్ ప్రతినిధులు తెలిపారు. అలాగే సంస్థకు కొత్త ముఖ్య ఆర్థికవేత్తను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా(IMF MD) వెల్లడించారు.
"సంస్థకు గీత అందించిన సేవలు చిరస్మరణీయం. ఆమె అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నారు. సంస్థపై ఆమె ఎంతో ప్రభావం చూపారు. పలు ముఖ్య కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించారు" అని ఆమెను జార్జివా ప్రశంసించారు.