కొవిడ్ పరీక్షల పరిశోధనలో మరో మైలురాయి! అత్యంత తక్కువ ఖర్చుతో.. కచ్చితమైన ఫలితాన్ని, వేగంగా అందించే సరికొత్త పరికరాన్ని ఇలినోయిస్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించారు. బ్యాటరీతో నడిచే ఈ పరికరం చేతిలో ఇట్టే ఒదిగిపోతుంది. అత్యంత చిన్న లాలాజలం చుక్కలోని వైరస్ జాడను కూడా ఈ పరికరం పసిగట్టి.. అరగంటలో సరైన ఫలితాన్ని వెల్లడిస్తుందని పరిశోధనకర్త హుయిమిన్ ఝావో చెప్పారు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరైనా దీన్ని వాడుకోవచ్చని.. శాంపిళ్లను ఈ పరికరంలోకి చొప్పించినప్పుడు జాగ్రత్త వహిస్తే చాలని అన్నారు.
ఈ పరికరంతో వేగంగా కొవిడ్ పరీక్ష, మెరుగైన ఫలితం! - ఇలినోయిస్ యూనివర్సిటీ పరిశోధకుల తాజా ఆవిష్కరణలు
కరోనా పరీక్షా ఫలితాన్ని వేగంగా వెల్లడించే పరికరాన్ని ఆవిష్కరించారు శాస్త్రవేత్తలు. అతి తక్కువ ఖర్చుతో, కచ్చితమైన ఫలితాన్నిచ్చే ఈ పరికరాన్ని ఇలినోయిస్ పరిశోధకులు రూపొందించారు. అత్యంత చిన్న లాలాజలం చుక్కలోని వైరస్ జాడను ఈ పరికరం కేవలం 30నిమిషాల్లోనే పసిగడుతుందని పరిశోధనాకర్తలు వెల్లడించారు.
కరోనా పరీక్ష, కొవిడ్ టెస్ట్
"వైరస్‌లోని ప్రత్యేక జన్యువులను గుర్తించేలా వాటి డీఎన్ఏ సమాచారంతో కూడిన కొన్ని ఎంజైములను రూపొందించాం. తర్వాత వాటిని మేము తయారుచేసిన పరికరంలో అమర్చాం. లక్షిత జన్యువులను గుర్తించిన వెంటనే ఈ ఎంజైముల్లో ఉండే ట్యాగ్లు వెలుగులు విరజిమ్ముతాయి. దీంతో ఈ పరికరం 'పాజిటివ్' సంకేతం ఇస్తుంది. స్కేలబుల్ అండ్ పార్టబుల్ టెస్టింగ్ (స్పాట్)గా పిలిచే ఈ విధానం చాలా సులభమైనది" అని హుయిమిన్ వివరించారు.
ఇదీ చదవండి:'కనిష్ఠ స్థాయికి మోదీ ప్రతిష్ఠ'