తెలంగాణ

telangana

ETV Bharat / international

టిబెట్​లో చైనా అధికారులపై ఆంక్షలు విధిస్తాం: బైడెన్ - టిబెట్ సమస్యపై బెడెన్

టిబెబ్​లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న చైనాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు అమెరికా డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్. తాను అధికారంలోకి వస్తే అక్కడి చైనా అధికారులపై ఆంక్షలు విధిస్తామని హామీ ఇచ్చారు. చైనా అధ్యక్షుడితో స్నేహాన్ని కాపాడుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టిబెట్ సమస్యలపై గుడ్డిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

US-BIDEN-TIBET
టిబెట్

By

Published : Sep 4, 2020, 11:23 AM IST

టిబెట్‌పై నియంత్రణను మరింత కఠినతరం చేయాలన్న చైనా ప్రయత్నాలను అమెరికా డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఖండించారు. ఆయన అధికారంలోకి వస్తే టిబెట్​లో మానవ హక్కుల ఉల్లంఘనకు కారణమైన చైనా అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

"టిబెట్​లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న చైనా అధికారులపై మా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది. టిబెట్ ప్రజలకు మద్దతిస్తాం. రేడియో ఫ్రీ ఆసియా, వాయిస్​ ఆఫ్​ అమెరికాలో టిబెటన్ భాషలో సేవలను విస్తరిస్తాం. బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఇది టిబెటన్లకు సమాచారం అందుతుంది."

- జో బైడెన్​, అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు

అంతేకాకుండా అధ్యక్షుడి హోదాలో గురువు దలైలామాతో భేటీ అవుతానని తెలిపారు బైడెన్. టిబెటన్ల సమస్యల కోసం ఆయనను ప్రత్యేక సమన్వయ కర్తగా నియమిస్తామని స్పష్టం చేశారు. టిబెట్​లో అమెరికా దౌత్యవేత్తలతో పాటు పాత్రికేయులకు అనుమతులు ఇవ్వాలని చైనాను డిమాండ్ చేశారు.

ట్రంప్​పై విమర్శలు..

టిబెటన్ల సమస్యలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుడ్డిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు బైడెన్. వాణిజ్య ఒప్పందంపై దృష్టి పెట్టి చైనా అధ్యక్షుడితో తన స్నేహాన్ని కాపాడుకున్నారని విమర్శించారు. ఇన్నాళ్లుగా దలైలామాను కలవని మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారని అన్నారు.

"హాంకాంగ్, షిన్​జియాంగ్​లో తరహాలోనే టిబెట్​లో అణచివేత ప్రయత్నాలను చైనా ముమ్మరం చేస్తోంది. ఇలాంటి కీలకమైన విషయంలో అమెరికా నాయకత్వాన్ని ట్రంప్ విస్మరించారు. ప్రత్యేక సమన్వయకర్తను నియమించాలనే చట్టబద్ధమైన అవసరాన్ని కూడా నెరవేర్చలేదు" అని పేర్కొన్నారు బైడెన్.

టిబెట్​పై మరింత నియంత్రణ పెంచుకునేందుకు చైనా కొత్త ప్రణాళికలను గతవారం తీసుకొచ్చింది. తద్వారా టిబెటన్ల మానవ హక్కులు, మత స్వేచ్ఛలు. గౌరవాన్ని నాశనం చేస్తూనే ఉందని ఆరోపించారు బైడెన్​.

విభేదాలపై చర్చించాలి: పాంపియో

విభేదాలను పరిష్కరించుకునేందుకు దలైలామా లేదా ఆయన ప్రతినిధులతో చైనా చర్చలు జరపాలని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సూచించారు. టిబెట్​ బౌద్ధమతాన్ని చైనీకరణ చేయాలన్న ప్రకటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు.

ఇదీ చూడండి:'టిబెట్ సమస్య పరిష్కారానికి భారత్నాయకత్వం'

ABOUT THE AUTHOR

...view details