తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​కు కరోనా తగ్గకపోతే డిబేట్ వద్దు: బైడెన్ - states relief package news

డొనాల్డ్​ ట్రంప్‌కు కరోనా తగ్గకపోతే రెండో సంవాదంలో పాల్గొననని డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్తి జో బైడెన్‌ ప్రకటించారు. ట్రంప్‌ కరోనాతో బాధపడితే తర్వాతి డిబేట్​ జరగకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు తొలి సంవాదంలో భాగంగా ట్రంప్​ను విదూషకుడిగా అభివర్ణించకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు.

"If Trump Still Has Covid, We Shouldn't Have A Second Debate": Joe Biden
ట్రంప్​కు కరోనా తగ్గకపోతే డిబేట్ వద్దు: బైడెన్

By

Published : Oct 7, 2020, 12:28 PM IST

శ్వేతసౌధంలో ఇంకా కరోనా చికిత్స అందుకుంటున్న ట్రంప్‌.. అప్పుడే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ట్వీట్‌ కూడా చేశారు. అక్టోబర్‌ 15న జరగబోయే అధ్యక్ష అభ్యర్థుల రెండో సంవాదంలో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు.

మరోవైపు ఆయన ప్రత్యర్థి డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ మాత్రం అందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ట్రంప్‌ ఇంకా కరోనాతో బాధపడుతున్నట్లయితే తదుపరి సంవాదాన్ని నిర్వహించడం శ్రేయస్కరం కాదని అభిప్రాయపడ్డారు. కొవిడ్‌ నిబంధనల మేరకు నడుచుకోవడం మంచిదని పేర్కొన్నారు.

"ట్రంప్‌కు ఇంకా కరోనా ఉన్నట్లయితే, చర్చ నిర్వహించకూడదు. ఇప్పటికే చాలా మంది వైరస్‌తో బాధపడుతున్నారు. ఇది చాలా తీవ్రమైన సమస్య. నేను క్లీవ్‌లాండ్‌ క్లినిక్‌ నిబంధనల ప్రకారం నడుచుకుంటాను. వైద్యుల సూచనల ప్రకారం ముందుకు వెళ్లడం మేలు. ప్రస్తుతం అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితి ఏంటో నాకు తెలియదు. నాకూ ఆయనతో చర్చలో పాల్గొనాలనే ఉంది. కానీ, నిబంధనల్ని పాటించడం కూడా అవసరమే"

-- జో బైడెన్​, డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి

ఇదీ చదవండి: ట్రంప్​ X బైడెన్​: వాడీవేడిగా తొలి డిబేట్​

'అలా అనాల్సింది కాదు'

ట్రంప్​తో తొలి డిబేట్​లో భాగంగా అధ్యక్షుడిని విదూషకుడిగా(జోకర్​గా) పిలవాల్సింది కాదని వివరణ ఇచ్చారు బైడెన్. డిబేట్​ అనాగరికంగా ఉందని అనాల్సిందని అన్నారు. ట్రంప్​తో జరిగిన సంవాదంలో మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం చాలా కష్టంగా అనిపించిందని చెప్పుకొచ్చారు. అతనితో అరుస్తూ డిబేట్ ప్రక్రియను మరింత సంక్లిష్టంగా మార్చాలని అనుకోలేదని తెలిపారు. అలా బెదిరించే అధ్యక్షుడు ఉండటం విచారకరమని అన్నారు.

ఇదీ చదవండి: 'ఎలా ఉన్నావ్?' నుంచి 'నోరు మూస్తావా' వరకు...

ఎలాంటి లక్షణాలు లేవు..

వాల్టీర్‌ రీడ్‌ సైనిక ఆస్పత్రి నుంచి శ్వేతసౌధానికి చేరుకున్న ట్రంప్‌ ఆరోగ్యంగా ఉన్నారని.. వైద్య బృందం వెల్లడించింది. సోమవారం రాత్రి ఎలాంటి సమస్యలు తలెత్తలేదని తెలిపింది. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని డాక్టర్‌ సియాన్‌ కాన్లే తెలిపారు. ఆక్సిజన్‌ స్థాయిలు సహా ఇతర సంకేతాలన్నీ సాధారణంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఉద్దీపన చర్చలు ఆపండి..

కరోనా ప్రభావం నుంచి వ్యాపారస్థులు, ప్రజలకు ఉపశమనం కలిగించేలా ప్రకటించాలనుకుంటున్న ఉద్దీపన పథకంపై డెమొక్రాట్లతో చర్చలు నిలిపివేయాలని ట్రంప్‌ ఆదేశించారు. స్పీకర్‌ నాన్సీ పెలోసీకి తమ ఉద్దీపన చర్యలపై ఏమాత్రం విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ముగిసే వరకు చర్చలు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. గెలిచిన తర్వాత అన్ని వర్గాలకు ఉపయోగపడేలా ఓ భారీ ఉద్దీపన బిల్లును సభలో ప్రవేశపెడతామని ట్రంప్​ స్వయంగా స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details