తెలంగాణ

telangana

ETV Bharat / international

'హెచ్​- 1బీ వీసాలను తక్షణమే పునరుద్ధరిస్తా' - joe biden latest promises

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే హెచ్​- 1బీ వీసాలను పునరుద్ధరిస్తానని డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇమ్మిగ్రేషన్​ ప్రక్రియలో కీలక సంస్కరణలు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అధ్యక్షుడి బాధ్యతలు చేపడితే తొలి 100 రోజుల్లో తీసుకునే నిర్ణయాలపై స్పష్టతనిచ్చారు బైడెన్.

Joe Biden
జో బైడెన్

By

Published : Jul 2, 2020, 12:34 PM IST

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే.. హెచ్​-1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేస్తానని డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్​ ప్రకటించారు. నవంబర్​లో జరిగే ఎన్నికల్లో గెలిస్తే భారతీయులు కోరుకుంటున్న ఈ వీసాలను జారీ చేస్తానని తెలిపారు.

ఓ వార్తా సంస్థ నిర్వహించిన ఆసియా అమెరికన్​ అండ్ పసిఫిక్ ఐలాండర్​ (ఏఏపీఐ) భేటీలో మాట్లాడారు బైడెన్. అమెరికా అభివృద్ధిలో హెచ్​-1బీ వీసాదారుల భాగస్వామ్యాన్ని ప్రశంసించారు. అధ్యక్షుడిగా ఎన్నికైతే తొలి 100 రోజుల్లో తీసుకునే నిర్ణయాలను వెల్లడించారు.

"ఈ ఏడాది చివరివరకు ట్రంప్ హెచ్​-1బీ వీసాలకు ముగింపు పలికారు. ట్రంప్ వలస విధానం చాలా క్రూరమైనది. అది నా పాలనలో జరగదు. కంపెనీ వీసా మీద వచ్చిన విదేశీయులు ఈ దేశాన్ని నిర్మించారు. ఇమ్మిగ్రేషన్​ ప్రక్రియలో సంస్కరణలు కూడా చేపడుతాను. కోటి మందికిపైగా పత్రాలు లేని వలసదారులకు పౌరసత్వం కల్పించేందుకు విధివిధానాలను రూపొందిస్తాం. ఇందులో 17 లక్షల మంది ఏఏపీఐకి చెందినవారే ఉన్నారు."

- జో బైడెన్​, అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు

అంతేకాకుండా అమెరికాకు రావాలనుకునే అర్హులైన లక్ష మంది తూర్పు, దక్షిణాసియా ప్రజలకు రక్షణ కల్పించేలా తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు బైడెన్. ముస్లిం ప్రయాణ నిషేధాన్ని ఉపసంహరించుకోవటంతో పాటు అమెరికా విలువలు, చారిత్రక నాయకత్వానికి అనుగుణంగా శరణార్థుల ప్రవేశాన్ని వెంటనే పునరుద్ధరిస్తానని చెప్పారు.

ఈ వీసానే కీలకం..

హెచ్​-1బీ అనేది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. ఇది సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ కార్మికులను నియమించడానికి అమెరికా కంపెనీలను అనుమతిస్తుంది. భారత్​, చైనా వంటి దేశాల నుంచి ఏటా 10 వేల మంది ఉద్యోగులను నియమించడానికి అమెరికా సంస్థలు ఈ వీసాపై ఆధారపడుతాయి.

ఇదీ చూడండి:'అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే భారత్​కే అధిక ప్రాధాన్యం'

ABOUT THE AUTHOR

...view details