అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి జో బైడెన్ లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికా చరిత్రలోనే బైడెన్ లాంటి 'చెత్త అభ్యర్థి'ని చూడలేదంటూ పరుష పదాజాలంతో తీవ్రంగా విమర్శించారు. పెన్సిల్వేనియాలో రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రత్యర్థి ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్.
'బైడెన్ గెలిస్తే వామపక్ష తీవ్రవాదులు రెచ్చిపోతారు' - AMERICA ELECTION LATEST NEWS
కరోనా నుంచి కోలుకున్న డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. ప్రత్యర్థి బైడెన్‌పై ప్రచార సభలో మరోసారి విరుచుకుపడ్డారు. అమెరికా చరిత్రలోనే బైడెన్ లాంటి 'చెత్త అభ్యర్థి'ని చూడలేదని దుయ్యబట్టారు.
'బైడెన్ గెలిస్తే వామపక్ష తీవ్రవాదులు రెచ్చిపోతారు'
అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధిస్తే వామపక్ష తీవ్రవాదులు రాజ్యమేలుతారని అధ్యక్ష ట్రంప్ ప్రజలను హెచ్చరించారు. ఎన్నికల్లో బైడెన్ గెలిస్తే చైనాతోపాటు ఇతర దేశాలు గెలుస్తాయని చెప్పారు. అదే తాను గేలిస్తే.. అది పెన్సిల్వేనియా విజయం అని, అమెరికా ప్రజలు గెలుపు అని అన్నారు. బైడెన్ లాంటి వ్యక్తితో అధ్యక్ష పోటీలో తలపడాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. ఇది తనపై ఒత్తిడిని మరింత పెంచుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు.