ఇడా తుపాను (hurricane ida 2021) ధాటికి అమెరికా విలవిలలాడుతోంది. అగ్రరాజ్యంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలుల ధాటికి అనేక చెట్లు నేలకూలాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. న్యూయార్క్, న్యూజెర్సీలో 8 మంది మరణించినట్టు తెలుస్తోంది. అనేకమంది క్షతగాత్రులైనట్టు సమాచారం.
Hurricane Ida: అంతా పోయింది.. బురదే మిగిలింది!
ఇడా హరికేన్(hurricane ida 2021) బీభత్సంతో అగ్రరాజ్యం అల్లకల్లోలంగా మారింది. లాస్ఏంజెల్స్, న్యూయార్క్, న్యూజెర్సీ.. ఇలా దేశంలోని అనేక ప్రాంతాలు ఇడా కారణంగా విలవిలలాడుతున్నాయి. నివాసాల్లోకి వరద నీరు చేరడం వల్ల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇడా ధాటికి 8 మంది మరణించినట్టు సమాచారం.
ఇడా
దక్షిణ న్యూజెర్సీ(usa hurricane news)లో ఓ టోర్నడో బీభత్సం సృష్టించింది. టోర్నడో ధాటికి అనేక ఇళ్లు నెలమట్టమయ్యాయి. రంగంలోకి దిగిన సహాయక బృందాలు రాత్రింబవళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునేందుకు శ్రమిస్తున్నారు.
ఇదీ చూడండి:-Hurricane Ida: తుఫాన్ ఎఫెక్ట్- రివర్స్ గేర్లో ప్రవహిస్తున్న నది!