అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... అన్ని రకాల వలసలను తాత్కాలికంగా రద్దు చేస్తూ కార్యానిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. కరోనా సంక్షోభం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. అమెరికన్ పౌరుల ఉద్యోగాలను పరిరక్షించేందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
60 రోజుల పాటు
వలసల తాత్కాలిక రద్దు అనేది 60 రోజుల పాటు అమల్లో ఉంటుందని ట్రంప్ స్పష్టంచేశారు. 60 రోజుల తర్వాత అప్పటి పరిస్థితిని అనుసరించి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అమెరికా పౌరుల సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు ట్రంప్.
డొనాల్డ్ దెబ్బకు గ్రీన్ కార్డుల జారీ నిలిపివేయనున్నారు. ఫలితంగా ఎన్నో ఏళ్లుగా అమెరికాకు వెళ్లాలని ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయులకు తీవ్ర నిరాశ మిగలనుంది.
ఇదీ చూడండి:కిమ్ ఆరోగ్యంపై మౌనం వీడని ఉత్తర కొరియా