అమెరికాలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. టీకా తీసుకున్న వారిలో కొందరు తమకు ఇక తిరుగు లేదని భావిస్తోంటే.. ఎంతవరకు భద్రం అని భావించేవారు కొందరున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అంటు వ్యాధుల నివారణ కేంద్రం(సీడీసీ) పలు సూచనలు చేసింది.
- 'చిన్న చిన్న సమావేశాలకు హాజరవ్వొచ్చు.. వాటిని హాయిగా ఆస్వాదించవచ్చు.. కానీ మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని కొనసాగించడం మాత్రం తప్పనిసరి'.
- టీకాలు తీసుకున్న వ్యక్తులు ఇతర వ్యక్తులతో మాస్కులు లేకుండా ఇండోర్ హాళ్లలో సమావేశం కావొచ్చు.
- వ్యాక్సిన్ తీసుకోని వారిని సైతం.. కరోనా ప్రమాదం తక్కువగా ఉందని పరిగణిస్తే ఒకసారి కలుసుకోవచ్చు(టీకా తీసుకున్నవారు).
- వ్యాక్సిన్కి సంబంధించి పూర్తి డోసులు తీసుకున్న రెండు వారాల తర్వాత మాత్రమే ఒక వ్యక్తిని పూర్తిగా టీకా తీసుకున్నట్లు పరిగణిస్తారు.
- టీకాలు తీసుకున్న వ్యక్తుల కార్యకలాపాలపై మార్గదర్శకాలు విడుదల చేసిన సీడీసీ.. అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. అయితే రెస్టారెంట్లు, ఇతర ప్రదేశాలకు వెళ్లడంపై ఎటువంటి సిఫార్సులు చేయలేదు.
టీకాలు అందుబాటులోకి రావడంతో పాటు.. మహమ్మారి తీవ్రత తగ్గుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో మరిన్ని కార్యకలాపాలను అనుమతించడానికి నూతన మార్గదర్శకాలను విడుదల చేయాలని సీడీసీ భావిస్తోంది.