కరోనా కాలంలో మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తీరు చర్చనీయాంశమైంది. అయితే తాజాగా ఈ విషయంపై మరోసారి ట్రంప్ స్పందించారు. పరిస్థితులు డిమాండ్ చేస్తే... మాస్క్ పెట్టుకోవడానికి తనకు ఇబ్బందేమీ లేదన్నారు.
అంతేకాదు మరోసారి అందరూ అవాక్కయ్యే సూచనలు చేశారు. అమెరికా వ్యాధి నియంత్రణ-నివారణ కేంద్రం సూచనలను గాలికి వదిలేశారు. మహమ్మారి అమెరికాను అతలాకుతలం చేస్తున్నా... దేశవ్యాప్తంగా మాస్కులు పెట్టుకోవడం తప్పనిసరేమీ కాదని స్పష్టం చేశారు ట్రంప్. భౌతిక దూరం పాటించే వీలు లేనప్పుడే మాస్కులు పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.
"నేను మాస్క్ పెట్టుకుంటాను.. నా దగ్గర ఓ నలుపు రంగు మాస్క్ ఉంది. అంటే, నేను మాస్క్ పెట్టుకోవడం ప్రజలు చూశారు. వారికి మాస్క్ పెట్టుకుంటే మంచిది అనిపిస్తే వారు పెట్టుకోవచ్చు. పది అడుగుల దూరం పాటించకుండా.. సమూహంలో ఉన్నప్పుడు నేను పెట్టుకుంటాను. కానీ, నేను సాధారణంగా అలాంటి వాతావరణంలో ఉండను. పరిస్థితి డిమాండ్ చేస్తే బహిరంగంగా మాస్క్ పెట్టుకోవడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు."