తెలంగాణ

telangana

ETV Bharat / international

గేమ్​ ఛేంజర్​ హైడ్రాక్సీక్లోరోక్విన్​తోనే అధిక మరణాలు!

కరోనా మహమ్మారికిపై ప్రభావవంతంగా పనిచేస్తుందని భావిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్​తోనే ప్రాణాపాయం ఎక్కువని అమెరికాలోని ఓ పరిశోధన వెల్లడించింది. ఈ డ్రగ్​తో​ చికిత్స పొందిన రోగుల్లో 27 శాతానికిపైగా మరణించగా, సాధారణ చికిత్స తీసుకున్నవారిలో 11.4 శాతమే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ప్రభుత్వం దీని వినియోగాన్ని నిషేధించే విషయంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

Hydroxychloroquine linked to increased risk of COVID-19 deaths
హైడ్రాక్సీక్లోరోక్విన్​ చికిత్సతోనే మరణాలు ఎక్కువ!

By

Published : May 17, 2020, 7:01 PM IST

Updated : May 17, 2020, 10:29 PM IST

కరోనా వైరస్​ను నిలువరించేందుకు హైడ్రాక్సీక్లోరోక్విన్​ను దివ్య ఔషధంలా భావిస్తున్నాయి ప్రపంచదేశాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సైతం ఈ డ్రగ్​ను వైరస్​ పోరులో 'గేమ్ ఛేంజర్'​గా అభివర్ణించారు. అయితే అమెరికా పరిశోధకులు చెబుతున్న విషయాలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కరోనా రోగులకు హైడ్రాక్సీక్లోరోక్విన్​తోనే ఎక్కువ ప్రాణముప్పు ఉందని తెలిపారు. ఈ డ్రగ్​తో చికిత్స అందించిన రోగుల్లో 27శాతానికిపైగా మంది మరణించగా, క్లోరోక్విన్​-హైడ్రాక్సీక్లోరోక్విన్ కాంబినేషన్​లో చికిత్స అందించిన రోగుల్లో 22శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ డ్రగ్స్​ను వాడని కరోనా రోగుల మరణాల రేటు మాత్రం 11.4 శాతమే ఉందని అధ్యయనం వెల్లడించింది.

హైడ్రాక్సీక్లోరోక్విన్ వినియోగాన్ని తక్షణమే నిలివేసేలా చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అక్కడి డ్రగ్​ నిపుణులు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెబుతున్నారు.

హైడ్రాక్సీక్లోరోక్విన్​ కరోనా రోగుల్లో ప్రతికూల ప్రభావం చూపుతోందని అధారాలున్నట్లు అమెరికా ఫుడ్​ అండ్ డ్రగ్​ అడ్మినిస్ట్రేషన్​(ఎఫ్​డీఏ) గతనెలలోనే హెచ్చిరించింది. ఈ డ్రగ్​ను అత్యవసరంగా వినియోగించవచ్చని అనుమతిచ్చిన కొద్ది వారాలకే ఎఫ్​డీఏ ఈ ప్రకటన చేసినట్లు వాషింగ్టన్​ పోస్ట్​ వార్త ప్రచురించింది.

హైడ్రాక్సీక్లోరోక్విన్​తో చికిత్స అందిస్తే.. రోగులు శ్వాసకోస సంబంధిత సమస్యల బారినపడి ప్రాణాలు కోల్పోయే అవకాశం మరింత ఎక్కువగా ఉందని అమెరికా వైద్య నిపుణులు చెబుతున్నారు. తక్షణమే దీని వాడకాన్ని నిషేధించాలని సూచిస్తున్నారు.

ఈ డ్రగ్​ను పరీక్షించకుండా వినియోంగించేందుకు అనుమతించవద్దని హెచ్చరించిన మాజీ వ్యాక్సిన్​ ఉన్నతాధికారి రిక్​ బ్రైట్​ను గతనెలలోనే పదవి నుంచి తప్పించింది ట్రంప్ ప్రభుత్వం. కరోనా చికిత్సకు దీనిని తక్షణమే వినియోగించాలని శాస్త్రవేత్తలపై శ్వేతసౌధం ఒత్తిడి తెచ్చినట్లు రిక్ ఆరోపించారు.

ఇప్పుడు అమెరికాలోని వైద్యులు, ఆరోగ్య నిపుణులు, అధికారులు హైడ్రాక్సీక్లోరోక్విన్​ను నిషేధించాలని ట్రంప్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Last Updated : May 17, 2020, 10:29 PM IST

ABOUT THE AUTHOR

...view details