కరోనా చికిత్సకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు శ్వేధసౌధం అధికారి ఒకరు తెలిపారు. హెచ్సీక్యూ వాడకాన్ని అమెరికాలో విపరీతంగా రాజకీయం చేశారని, కానీ భారత్‌లో ఆ మందును ఇప్పటికీ విరివిగా వాడుతున్నట్లు ట్రేడ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ డైరక్టర్ పీటర్ నవర్రొ చెప్పారు.
మలేరియా చికిత్సకు వాడే హెచ్సీక్యూ మందు.. కొవిడ్ ఆరంభ దశలో ఉన్నవారికి బాగా పనిచేస్తున్నట్లు తాజా పరిశోధనల్లో తేలినట్లు పీటర్ నవర్రొ వెల్లడించారు. ఈ మందు వాడకం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని.. దాదాపు 50శాతం మరణాల రేటు తగ్గిందని ట్రేడ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ డైరెక్టర్ అన్నారు.