అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్ కుమారుడిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా విభాగం దృష్టిసారించినట్లు కనపడుతోంది. ఈ మేరకు పన్నులకు సంబంధించిన అంశంపై దర్యాప్తును ఎదుర్కొంటున్నట్లు తెలిపారు హంటర్ బైడెన్. జో బైడెన్ ఎన్నికల ప్రచారాల్లో హాంటర్ ఆర్థిక లావాదేవీల పాత్రపై ఈ దర్యాప్తు కొనసాగే అవకాశముంది.
విచారణకు హాజరుకావాలని కోరుతూ గత మంగళవారం మరోమారు హంటర్ బైడెన్‌కు సమన్లు జారీ చేశారు ఫెడరల్ అధికారులు. దర్యాప్తు గురించి తనకు మంగళవారం సమాచారం అందినట్లు హంటర్ బైడెన్ ప్రకటనలో వెల్లడించారు. కానీ ఎలాంటి విషయాలు బహిరంగపరచలేదు.
"ఈ విషయాన్ని నేను చాలా తీవ్రంగా తీసుకుంటున్నా. కానీ ఈ దర్యాప్తులో వృత్తిపరమైన, ఇతర సమీక్షలు.. టాక్స్ అడ్వైజర్స్ ప్రయోజనంతో సహా నా వ్యవహారాలను చట్టబద్ధంగా, సముచితంగా నిర్వహించానని నిరూపిస్తాయని నాకు నమ్మకం ఉంది."