అమెరికాలో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న న్యూయార్క్‌లో వైద్య సామగ్రి నిల్వలు గణనీయంగా తరిగిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 10 రోజుల్లో తమ ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు నిండుకునే పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని న్యూయార్క్ నగర మేయర్ డి బ్లాసియో ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది వినియోగించే వ్యక్తిగత పరిరక్షణ సామగ్రి కొరత కూడా తీవ్రంగా ఉందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో 5% ఒక్క న్యూయార్క్‌లోనివే కావడం గమనార్హం. మరోవైపు, కరోనాను ఎదుర్కొనేందుకుగాను వేల సంఖ్యలో అదనపు పడకలను సమకూర్చుకోవాలని ఆస్పత్రులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు.