అమెరికా కాలిఫోర్నియాలో కార్చిచ్చు అంతకంతకూ వ్యాపిస్తోంది. మూడు వారాలుగా విస్తరిస్తున్న దావానలం బుధవారం ఒక్కసారిగా విజృంభించింది. అడవులు, కొండలను దహించివేస్తోంది. మారుమూల గ్రామాల్లోని అనేక ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.
News in Images: కాలిఫోర్నియాలో భయానక దృశ్యాలు - అమెరికా కాలిఫోర్నియా మంటలు
కాలిఫోర్నియాను కార్చిచ్చు కమ్మేసింది. అనేక ఇళ్లు మంటలకు కాలిపోయాయి. వాతావరణం పొడిగా ఉన్నందున మంటలు మరింతగా వ్యాపించే ప్రమాదం ఉంది.
కాలిఫోర్నియా కార్చిచ్చు
వాతావరణం పొడిగా ఉన్నందు వల్ల మంటలు మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. ప్లుమాస్, బుట్టే కౌంటీలలో ఇప్పటికే వెయ్యి చదరపు కిలోమీటర్లకు పైగా భూభాగంలో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. ఇందుకు సంబంధించిన చిత్రాలు అత్యంత భీతిగొలిపేలా ఉన్నాయి.