తెలంగాణ

telangana

By

Published : Sep 22, 2019, 1:09 PM IST

Updated : Oct 1, 2019, 1:48 PM IST

ETV Bharat / international

భారత్​ గురించే 30 నిమిషాల పాటు ట్రంప్​ ప్రసంగం!

హ్యూస్టన్​లో నేడు జరగనున్న ప్రతిష్టాత్మక 'హౌడీ-మోదీ' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సుమారు 30 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు. ముఖ్యంగా భారత్​, భారత సంతతి అమెరికన్లపైనే ప్రసంగం ఉండనుందని అంచనా. ప్రఖ్యాత ఎన్​ఆర్​జీ మైదానంలో ట్రంప్​ సుమారు 100 నిమిషాల పాటు ఉంటారు.

భారత్​ గురించే 30 నిమిషాల పాటు ట్రంప్​ ప్రసంగం!

భారత్​ గురించే 30 నిమిషాల పాటు ట్రంప్​ ప్రసంగం!

అమెరికా చమురు రాజధాని హ్యూస్టన్​లోని ప్రవాస భారతీయులు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హౌడీ-మోదీ కార్యక్రమంలో భారత్​ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. భారత్​, భారత సంతతి అమెరికన్ల గురించి సుమారు 30 నిమిషాల పాటు ఈ ప్రసంగం సాగనుంది. ట్రంప్​ ప్రసంగంలో కీలక ప్రకటనలు ఉండే అవకాశం ఉందని.. దీని ద్వారా రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని అమెరికా అధికారులు పేర్కొంటున్నారు.

రానున్న అధ్యక్ష ఎన్నికల్లో హ్యూస్టన్​లోని ప్రవాస భారతీయుల మద్దతు పొందే లక్ష్యంతో ఈ భారీ కార్యక్రమానికి హాజరవుతున్నారు ట్రంప్. గతంలో ఎన్నడూ ఇలాంటి సభకు వెళ్లలేదు ఆయన.

100 నిమిషాల పాటు...

హౌడీ-మోదీ కార్యక్రమానికి హాజరవుతున్న ట్రంప్​ ప్రఖ్యాత ఎన్​ఆర్​జీ మైదానంలో సుమారు 100 నిమిషాల పాటు ఉంటారని శ్వేతసౌధం శనివారం షెడ్యూల్​ విడుదల చేసింది. కానీ ఆయన ప్రసంగం ఎంత సమయం వరకు ఉంటుందనే స్పష్టత ఇవ్వలేదు. గతంలో ట్రంప్​ చేసిన వ్యాఖ్యల ప్రకారం సుమారు 30 నిమిషాలుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు.

ప్రవాసుల మనుసు గెలిచేందుకే...

సుమారు 50 వేల మంది భారతీయ అమెరికన్ల మనసు గెలిచేందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ ఈ మెగా ఈవెంట్​కు హాజరవుతున్నారని ఇండో-అమెరికన్​ కమ్యూనిటీ నాయకుడు భారత్​ బరాయ్​ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు ఎంతగానో ఉపయోగపడుతుందని.. కార్యక్రమంలో పాల్గొనటం ద్వారా ట్రంప్​ భారత సంతతి అమెరికన్ల ఓట్లు ఎక్కువ మొత్తంలో సాధిస్తారని అభిప్రాయపడ్డారు బరాయ్​.

ఇదీ చూడండి:ప్రధాని హోదాను మరచి మోదీ ఏం చేశారో చూడండి...

Last Updated : Oct 1, 2019, 1:48 PM IST

ABOUT THE AUTHOR

...view details