తెలంగాణ

telangana

ETV Bharat / international

'హౌడీ మోదీతో భారత్​- అమెరికా బంధం సుదృఢం'

హ్యూస్టన్​లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమం ద్వారా భారత్​- అమెరికా దేశాధినేతలు తమ మైత్రిని ప్రపంచానికి చాటిచెప్పారు. ఈ సభతో ఇరు దేశాల బంధం మరింత పటిష్ఠం అవుతుందని నిపుణులు అభిప్రాయాలు వ్యక్తంచేశారు.

'హౌడీ మోదీతో భారత్​- అమెరికా సంబంధాల బలోపేతం'

By

Published : Sep 23, 2019, 1:37 PM IST

Updated : Oct 1, 2019, 4:42 PM IST

హ్యూస్టన్​ వేదికగా జరిగిన హౌడీ మోదీ కార్యక్రమం... ఇరు దేశాల మైత్రి సాధించిన విజయంగా అభివర్ణించింది భారత్-అమెరికా వ్యూహాత్మక, భాగస్వామ్య వేదిక(యూఎస్​ఐఎస్​పీఎఫ్​).​ ఈ సమావేశంతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయన్నారు యూఎస్​ఐఎస్​పీఎఫ్​ అధ్యక్షుడు ముకేశ్​ అఘి.

"ఈ కార్యక్రమం అగ్ర నేతల మధ్య ఉన్న స్నేహాన్నే కాదు... భారత్​- అమెరికా ద్వైపాక్షిక సంబంధాల పాట్ల వారికున్న అంకితభావాన్నీ తెలియజేసింది. ఆర్థికంగా, రాజకీయంగా అంతర్జాతీయ స్థాయిలో భారత్​కు ఉన్న స్థాయిని ప్రధాని ప్రసంగం మరింత పెంచింది. "

-ముకేష్​ అఘీ, యూఎస్​ఐఎస్​పీఎఫ్​ అధ్యక్షుడు

ఆదివారం హ్యూస్టన్​లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఒకే వేదికను పంచుకున్నారు. ఈ భారీ బహిరంగ సభలో 50వేల మంది పాల్గొన్నారు.

అంతర్జాతీయ మీడియా మాట...

హ్యూస్టన్​లో భారత్​, అమెరికా దేశాధినేతల ప్రసంగం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు పెరుగుదలకు హౌడీ మోదీ చిహ్నమని వాల్ట్​ స్ట్రీట్​ జర్నల్​ వార్తా సంస్థ పేర్కొంది. ఈ సభకు హాజరుకావడం ద్వారా 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​.. ఓటర్లను ఆకర్షించవచ్చని ఆశిస్తున్నట్టు వార్తా సంస్థ తెలిపింది.

ఇదీ చూడండి: ఎన్​ఆర్ఐ​ల ప్రశ్నకు తెలుగులో మోదీ జవాబు.

Last Updated : Oct 1, 2019, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details