మానవాళి మనుగడకు సవాలుగా మారి ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మూలాన్ని కనుగొన్నారు అమెరికా పరిశోధకులు. ఈ వైరస్ జంతువుల నుంచి వివిధ రూపాల్లోకి మారి చివరకు మనుషులకు హాని చేసే సామర్థ్యాన్ని పొందినట్లు వెల్లడించారు. టెక్సాస్ యూనివర్సిటీ సహా మరికొంత మంది శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన అధ్యయనం జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురితమైంది.
కరోనా వైరస్ జన్యు విశ్లేషణ అనంతరం గబ్బిలాల్లో వాప్తి చెందే వైరస్‌కు దీనితో దగ్గరి సంబంధాలున్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. క్లిష్టమైన జన్యు భాగం మార్పిడి ద్వారా వైరస్ వివిధ రకాలుగా రూపాంతరం చెంది గబ్బిలాల నుంచి అలుగులకు(పాంగోలిన్ జంతువు), ఆ తర్వాత మనుషులకు వ్యాప్తి చెందినట్లు అధ్యయనం తెలిపింది.