తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉద్దీపన ప్యాకేజీకి అమెరికా దిగువ సభ​ ఆమోదం - Biden latest news

కరోనా వల్ల దెబ్బతిన్న ప్రజలు, వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు 900 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ఎట్టకేలకు ఆమోదించింది అమెరికా దిగువ సభ​. ఈ బిల్లుపై ఓటింగ్ జరగగా.. భారీ మెజారిటీతో ఆమోదం పొందింది.

House passes USD 900 billion COVID relief, catchall measure
భారీ ఉద్దీపన ప్యాకేజీకి అమెరికా కాంగ్రెస్​ ఆమోదం

By

Published : Dec 22, 2020, 10:18 AM IST

కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ప్రజలు, చిరు వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు 900 బిలియన్ డాలర్ల భారీ ఉద్దీపన ప్యాకేజీ అమలుకు పచ్చజెండా ఊపింది అమెరికా దిగువ సభ​. 359-53 ఓట్లు తేడాతో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందింది. సెనేట్​లో ఓటింగ్​ తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బిల్లును పంపనున్నారు.

ఈ బిల్లు ద్వారా వారానికి 300 డాలర్ల మేర నిరుద్యోగులకు సాయం అందనుంది. ఎక్కువమంది అమెరికన్లకు 600డాలర్ల ప్రత్యక్ష ఉద్దీపన చెల్లింపుతో పాటు, చిరు వ్యాపారాలు, రెస్టారెంట్లు, థియేటర్లు, పాఠశాలలు, ఆరోగ్య సమస్య ఎదుర్కొంటున్న అద్దెదారులకు రాయితీలు దక్కనున్నాయి.

ఇదీ చూడండి:'900 బిలియన్​ డాలర్ల ప్యాకేజీ ఆమోదించండి'

ABOUT THE AUTHOR

...view details