కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ ఫేస్‌మాస్క్ పెట్టుకోవడం తప్పని సరిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రోజూ కొత్త మాస్క్ పెట్టుకోవడం ఖర్చుతో కూడుకున్న విషయం. అందుకే చాలా మంది పునర్వినియోగ మాస్క్‌లను వినియోగిస్తున్నారు. అయితే ఇలాంటి మాస్క్‌లను శుభ్రం చేయడం కూడా సవాలుతో కూడుకున్న పని. సబ్బుతో కడిగినా మాస్క్‌లు పూర్తిగా శుభ్రం అవుతాయన్న నమ్మకం లేదు.
సులభమైన పద్ధతి..
ఇలాంటి పరిస్థితుల్లో..ఇంట్లో ఉండే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, హీట్ పాట్ లాంటివి.. మాస్క్‌లను సమర్థంగా శుభ్రం చేయగలవని అమెరికా పరిశోధకులు కనుగొన్నారు. ఎన్95 మాస్క్‌లను 50 నిమిషాలపాటు కుక్కర్లలో 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వేడి చేయడం ద్వారా అవి పూర్తిగా శుభ్రమవుతున్నాయని గుర్తించారు. ఈ పద్ధతి ద్వారా ఎన్95 మాస్క్‌ల ఫిల్టర్లూ శక్తిమంతంగానే పని చేస్తాయని అంటున్నారు.