ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ చరిత్ర సృష్టించింది. ఇద్దరు వ్యోమగాములను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపి.. అంతరిక్ష యాత్రలపై కొత్త ఆశలను చిగురింపజేసింది. ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టిన స్పేస్ ఎక్స్.. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపిన మొట్టమొదటి వ్యాపార సంస్థగా రికార్డులకెక్కింది.
స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో.. నాసాకు చెందిన బాబ్ బెన్కెన్, డౌగ్ హార్లే అనే వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.
వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన తొలి వ్యాపారసంస్థగా చరిత్ర సృష్టించింది స్పేస్ ఎక్స్. 19 గంటలపాటు ప్రయాణించిన అనంతరం వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) చేరుకుంటారు.