తెలంగాణ

telangana

ETV Bharat / international

నా ప్రతి ప్రయత్నంలో ఆయన పాత్ర ఉంది: బిల్​గేట్స్​

మైక్రోసాఫ్ట్​ అధినేత బిల్​గేట్స్​ తండ్రి విలియం హెన్రీ గేట్స్​ కన్నుమూశారు. ఆయన సోమవారం మరణించినట్లు తన బ్లాగ్​లో బిల్​గేట్స్ వెల్లడించారు. తన ప్రతి ప్రయత్నంలో ఆయన తండ్రి భాగస్వామ్యం ఉందని తెలిపారు.

bill gates
బిల్​గేట్స్​

By

Published : Sep 17, 2020, 5:01 AM IST

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు, వితరణశీలి బిల్‌గేట్స్‌ తండ్రి విలియం హెన్రీ గేట్స్‌-2 కన్నుమూశారు. చాలాకాలంగా అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడుతున్న విలియం హెన్రీ సోమవారం మరణించినట్లు బిల్‌గేట్స్‌ వెల్లడించారు. తండ్రి మరణం కుటుంబానికి తీరనిలోటు అని బిల్‌గేట్స్‌ విచారం వ్యక్తం చేశారు.

94 ఏళ్ల హెన్రీ ఎంతో అర్థవంతమైన జీవితం గడిపారని.. తన వ్యక్తిగత జీవితంపై తండ్రి ప్రభావం ఎంతో ఉందని ఆయనతో ఉన్న జ్ఞాపకాలను బిల్‌గేట్స్‌ గుర్తుచేసుకున్నారు.

"తన తండ్రి నుంచి జ్ఞానంతో పాటు వినయ, విధేయతలను నేర్చుకోవడాన్ని నేను ఎప్పుడూ మరవలేదు. తమ వితరణ కార్యక్రమానికి ఎంతో తోడ్పాటునందించిన ఆయనకు నేను, మిలిండా ఇద్దరం రుణపడి ఉన్నాం. నా ప్రతి ప్రయత్నంలో ఆయన భాగస్వామ్యం ఉంది" అని తన జ్ఞాపకాలను బిల్‌గేట్స్‌ బ్లాగ్‌లో వివరించారు.

గేట్స్​ ఫౌండేషన్​కు చొరవ..

ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌ తన బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వితరణ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ఫౌండేషన్‌ ప్రారంభించడంలో హెన్రీ గేట్స్‌ కీలక పాత్ర పోషించినట్లు బిల్స్‌ పలుసార్లు స్పష్టంచేశారు. పోలియో నిర్మూలన, చిన్నారులకు టీకాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ ఫౌండేషన్‌ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది.

ఇదీ చూడండి:'కరోనా కుట్ర'పై బిల్​గేట్స్​ కీలక వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details