అమెరికాలోని డెలవేర్ రాష్ట్రంలో భారీ హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. హిందూ టెంపుల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 25 అడుగుల వాయుపుత్రుడి విగ్రహాన్ని ఆదివారం ప్రతిష్ఠించారు. నాలుగు రోజుల పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విపరీతమైన చలి ఉన్నప్పటికీ హనుమాన్ విగ్రహాన్ని దర్శించుకొనేందుకు అనేకమంది తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపు కార్యక్రమంలో పలువురు ప్రవాస భారతీయులు జెండాలు పట్టుకొని ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా సహస్ర కలశాభిషేకం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
అమెరికాలో 25 అడుగుల అంజన్న విగ్రహం ప్రతిష్ఠ
అమెరికాలోని డెలవేర్లో 25 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. హిందూ టెంపుల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుక ఘనంగా జరిగింది.
అమెరికాలో 25 అడుగుల హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన
దాదాపు 45 టన్నుల బరువు కలిగిన ఈ భారీ విగ్రహాన్ని తెలంగాణలోని వరంగల్ జిల్లాలో తయారుచేయించినట్టు డెలివేర్ హిందూటెంపుల్ అసోసియేషన్ అధ్యక్షుడు పాటిబండ శర్మ వెల్లడించారు. దాదాపు 12మందికి పైగా శిల్పులు ఏడాది పాటు నల్ల గ్రానైట్‌తో ఈ ప్రతిమను రూపొందించారు. అనంతరం ఈ ఏడాది జనవరిలో ఈ విగ్రహాన్ని సముద్ర మార్గం ద్వారా అమెరికా తరలించి డెలవేర్ రాష్ట్రంలో హకెస్సిన్ ప్రాంతంలోని ఉన్న హిందూ ఆలయం వద్ద ప్రతిష్ఠించారు.