కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయ-అమెరికన్లు సహా.. స్థానిక ప్రజల ఆహార అవసరాలు తీర్చేందుకు అగ్రరాజ్యంలోని హిందూ-అమెరికన్లు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. సుమారు 26 రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టి ఇతరులకు అండగా నిలుస్తున్నారు.
సేవా దీపావళి..
గత రెండు నెలలుగా అమెరికావ్యాప్తంగా 175కి పైగా సంస్థలు, వ్యక్తులు ఆహార అవసరాలు తీర్చే మహా యజ్ఞంలో తమవంతు సహకారాన్ని అందించారు. 26 రాష్ట్రాల్లోని 210 నగరాల్లోని 199 ప్యాంట్రీలు, ఉచిత ఆహార కిచెన్‌లు, ఆశ్రయాల్లో లక్షా 30వేల కేజీల ఆహారాన్ని సేకరించారు. 'సేవా దీపావళి' చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా న్యూజెర్సీలో రికార్డ్ స్థాయిలో 55000కేజీల ఆహారాన్ని సేకరించామని నిర్వాహకులు తెలిపారు.
'సేవా దీపావళి'... ప్రవాస భారతీయులకు అండగా నిలవాలనే లక్ష్యంతో న్యూజెర్సీలో 2018లో ప్రారంభమైంది.
ఇదీ చదవండి: 'టైర్ బెడ్స్'తో వీధి జంతువులకు చలి నుంచి రక్ష