మానవాళిని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిపై పోరుకు ప్రవాస భారతీయులు నడుంబిగించారు. కరోనా సంక్షోభం కారణంగా ఆకలితో అలమటిస్తున్న పేదలకు ప్రత్యక్ష ఉపశమనం కలిగించడానికి పలువురు భారతీయ అమెరికన్ కార్పొరేట్ దిగ్గజాలు కలిసి ఆరు లక్షల డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
'ఛలో గివ్ ఫర్ కొవిడ్-19' పేరిట ప్రారంభించిన ఈ నిధుల సేకరణకు.. అగ్రశ్రేణి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు, ప్రముఖులు 500 మిలియన్ డాలర్లు విరాళం అందించారు. ఆన్లైన్లో నిర్వహించిన ప్రచారానికి స్పందించిన మిగతా ప్రవాస భారతీయులు మరో 100 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు.
భారత్, అమెరికాలో కరోనా బారిన పడి ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు ఆహారం అందించేందుకు ఈ నిధులు వెచ్చించనున్నారు. యూఎస్‌లో 'ఫీడింగ్ అమెరికా', భారత్‌లో 'గూంజ్' సంస్థ ద్వారా ఈ కార్యక్రమం అమలు చేస్తారు.
ఒకరికొకరు.. సాయం