భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్రరాజ్య పర్యటన (Modi US visit) ముగిసిన పక్షం రోజుల్లోనే ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై (India US relations) భారత్-అమెరికాలు దృష్టి సారించాయి. ఇరు దేశాల విదేశాంగ శాఖ అధికారుల స్థాయిలో ఆర్థిక, జాతీయ భద్రత వంటి పలు కీలక అంశాలపై (India US news) ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. మరికొద్ది రోజుల్లో ఇరుదేశాల కేబినెట్ మంత్రుల పర్యటనలు సైతం జరగనున్నట్లు... శ్వేతసౌధం అధికార వర్గాలు పేర్కొన్నాయి. (US India ties)
భారత త్రిదళాధిపతి బిపిన్ రావత్ (CDS Rawat news) త్వరలో అమెరికాలో పర్యటించనుండగా అమెరికా నౌకాదళ అధిపతి సైతం వచ్చేవారం భారత్‌లో పర్యటించనున్నట్లు అగ్రరాజ్యం ఇప్పటికే ప్రకటించింది. అటు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అతి త్వరలో అమెరికాలో పర్యటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు, నవంబర్‌లో జరిగే భారత్-అమెరికా దేశాల రెండో విడత చర్చల్లో (2+2 India US) పాల్గొనేందుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్ వాషింగ్టన్ వెళ్లనున్నారు.
మోదీ అమెరికా పర్యటన