తెలంగాణ

telangana

ETV Bharat / international

వీర శునకానికి త్వరలో డొనాల్డ్ ట్రంప్ ఆతిథ్యం - బాగ్దాదీని వెంటాడిన జాగిలం

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ​ అధిపతి అల్​ బాగ్దాదీని అంతమొందించటంలో కీలక పాత్ర పోషించిన జాగిలం 'కోనన్​' త్వరలో శ్వేతసౌధానికి రానుంది. ఈ విషయాన్ని స్వయంగా అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించారు.

త్వరలో శ్వేతసౌధానికి బాగ్దాదీని వేటాడిన 'హీరో'

By

Published : Nov 7, 2019, 1:12 PM IST

కరడు గట్టిన ఉగ్రసంస్థ ఇస్లామిక్​ స్టేట్​ అధిపతి అబు బాకర్​ అల్​ బాగ్దాదీని చివరి వరకు వెంటాడి.. వేటాడిన వీర శునకం గుర్తుందా? ఆ జాగిలం త్వరలో శ్వేతసౌధాన్ని సందర్శించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తెలిపారు. బుధవారం లూసియానాలో జరిగిన ర్యాలీ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు ట్రంప్​.

"గొప్ప హీరో అయిన 'కోనన్'​ త్వరలో వైట్​హౌస్​ను సందర్శిస్తుంది" అని తెలిపారు అధ్యక్షుడు. శునకాన్ని త్వరగా తీసుకురమ్మని అధికారులను అడిగినప్పుడు.. 'కోనన్'​ మరో ఆపరేషన్​లో​ పాల్గొననున్నట్లు తెలిపారని ట్రంప్​ పేర్కొన్నారు. జాగిలాన్ని రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాతే శ్వేతసౌధానికి​ తీసుకురమ్మని ఆదేశించినట్లు స్పష్టం చేశారు.

స్పెషల్​ ఆపరేషన్స్​ కమాండ్ ​(ఎస్​ఓసీఓఎమ్​) కెనైన్​ ప్రోగ్రాంలో 'కోనన్​' నాలుగేళ్ల పాటు శిక్షణ పొందినట్లు అమెరికా సెంట్రల్​ కమాండర్​ జనరల్​ కెన్నెత్​ మెకెంజీ తెలిపారు. శిక్షణ తర్వాత ఇప్పటి వరకు దాదాపు 50 ప్రత్యేక​ ఆపరేషన్లలో​ 'కోనన్'​ పాల్గొన్నట్లు వెల్లడించారు. ఉగ్రవాది ఆల్​ బాగ్దాదీ సొరంగంలో ఆత్మాహుతి దాడి చేసుకున్నప్పుడు ఆ పేలుడులో జాగిలానికి గాయాలయ్యాయని మెకెంజీ గుర్తుచేశారు.

ఇదీ చూడండి:మీకు ఎక్కువకాలం బతకాలని ఉందా?

ABOUT THE AUTHOR

...view details