జో బైడెన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాక ఆయనతో పాటు తన రెండు పెంపుడు శునకాలూ శ్వేత సౌధంలోకి అడుగుపెట్టబోతున్నాయి. బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్.. ఛాంప్, మేజర్ అనే జర్మన్ షెపర్డ్ శునకాలను పెంచుకుంటున్నారు. అధ్యక్షుల పెంపుడు శునకాలు శ్వేత సౌధంలో రాజభోగాలు అనుభవించడం అమెరికాలో సాధారణమే.
నాలుగేళ్ల తర్వాత శ్వేతసౌధంలోకి శునకాలు - Biden Dogs news
జో బైడెన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాక ఆయనతో పాటు తన రెండు పెంపుడు శునకాలూ శ్వేత సౌధంలోకి అడుగుపెట్టబోతున్నాయి. బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ పెంచుకుంటున్న.. ఛాంప్, మేజర్ అనే జర్మన్ షెపర్డ్ శునకాలను వారితో పాటు తీసుకెళ్లనున్నారు.
నాలుగేళ్ల తర్వాత శ్వేతసౌధంలోకి శునకాలు
అయితే ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌నకు ఎలాంటి పెంపుడు శునకాలు లేవు. దీంతో నాలుగేళ్ల తర్వాత మళ్లీ వైట్‌హౌస్‌లో శునకాల సందడి కనిపించనుంది. ఇప్పటికే ఛాంప్, మేజర్‌లకు సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీ హోదా వచ్చింది. డాగ్స్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్(డీఓటీయూస్) అంటూ వాటి ఫొటోలను అభిమానులు పంచుకుంటున్నారు.
ఇదీ చూడండి:ఓటమిని అంగీకరించండి: ట్రంప్‌కు మెలానియా సలహా