తెలంగాణ

telangana

ETV Bharat / international

కుప్పకూలిన హెలికాప్టర్..​ ఐదుగురు మృతి - Helicopter crashes in US

అమెరికాలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Helicopter crashes in Alaska killing 5, seriously injuring 1
హెలికాప్టర్​ కుప్పకూలి.. ఐదుగురు మృతి

By

Published : Mar 29, 2021, 7:08 AM IST

అమెరికా అలస్కాలో హెలికాప్టర్​ కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కింక్​ హిమానీనదం ప్రాంతంలో శనివారం ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.

ఎయిర్‌బస్​ ఏఎస్​ 350 బీ3 హెలికాప్టర్ కూలినట్లు​ సమచారం అందుకున్న అధికారులు.. శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలను తొలగించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల ఎవరనేది అధికారులు వెల్లడించలేదు. అయితే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆ దేశ జాతీయ రవాణా భద్రతా బోర్డు తెలిపింది.

ఇదీ చూడండి:టీకా తీసుకున్నాక పుతిన్​ ఏమన్నారంటే..

ABOUT THE AUTHOR

...view details