న్యూయార్క్ నగరంలోని మ్యాన్‌హాట్టన్‌లో ఓ హెలికాప్టర్ భవనంపై కుప్పకూలింది. నేడు జరిగిన ఈ ఘటనలో పైలట్ మృతి చెందాడు. వర్షం వల్ల ఆకాశ మార్గం సరిగా కనపడక అత్యవసర ల్యాండింగ్ కోసం పైలట్ ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
హెలికాప్టర్‌ను ఎవరూ కూల్చలేదని, అత్యవసరంగా ఓ భవనంపై దించే ప్రయత్నంలో కుప్పకూలినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని న్యూయార్క్ గవర్నర్ అండ్రూ కుమో ప్రకటించారు. ప్రమాద సమయంలో భవనం స్వల్పంగా కంపించినట్టు కొందరు చెప్పారని తెలిపారు.