బ్రెజిల్‌లోని రియో డి జెనీరోను వరదలు ముంచెత్తాయి. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆరుగురు మృతిచెందారు. భారీ సంఖ్యలో ఇళ్లు, వాహనాలు, వృక్షాలు ధ్వంసమయ్యాయి. వరదల ధాటికి రోడ్లు కొట్టుకుపోయాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరిలిస్తున్నారు.
బ్రెజిల్లో భారీ వర్షాలకు ఆరుగురు మృతి - రియో డి జనీరో
బ్రెజిల్ నగరం రియో డి జనీరోను వరదలు ముంచెత్తాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇళ్లు, వృక్షాలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. వరదల కారణంగా ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వరద ముంపు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

బ్రెజిల్లో వరదలకు ఆరుగురు మృతి
బ్రెజిల్లో వరదలకు ఆరుగురు మృతి
" ఇక్కడ నిలిపిన కార్లు వరదలకు వీధి చివరి వరకు కొట్టుకుపోయాయి. వరదల కారణంగా కార్లు, రోడ్లు అన్నీ ధ్వంసమయ్యాయి."
- జోస్ ఔరేలియానో డా సిల్వా, స్థానికుడు.
ఏప్రిల్ నెలలో నమోదయ్యే సగటు వర్షపాతం కేవలం నాలుగు గంటల్లోనే నమోదవడం వల్ల జనజీవనం అతలాకుతలమైంది. దాదాపు 152 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని పర్యటక కేంద్రం బొటానికల్ గార్డెన్ పూర్తి స్థాయిలో ధ్వంసమైంది.