తెలంగాణ

telangana

ETV Bharat / international

సెల్​ఫోన్​తో హృదయ స్పందనల లెక్కింపు! - సెల్​ఫోన్​

ఇకపై హృదయ స్పందనలను తెలుసుకోవడానికి స్టెతస్కోప్​ అవసరం లేదు. చేతిలో స్మార్ట్​ఫోన్​ ఉంటే చాలు దానితోనే శ్వాసక్రియా రేటును, హృదయ స్పందనలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం వచ్చే నెలలో సరికొత్త ఫీచర్​ను తీసుకురానున్నట్లు గూగుల్​ సంస్థ వెల్లడించింది.

Heart rate count with cell phone
సెల్​ఫోన్​తో హృదయ స్పందనల లెక్కింపు!

By

Published : Feb 6, 2021, 7:51 AM IST

చేతిలో స్మార్ట్​ఫోన్​ ఉంటే చాలు. ఇకపై మన శ్వాసక్రియా రేటు, హృదయ స్పందనల వేగాన్ని మనం సులువుగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం సరికొత్త ఫీచర్​ను వచ్చే నెల నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్​ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతానికి పిక్సెల్​ ఫోన్లలో 'గూగుల్ ఫిట్​' యాప్​ పేరుతో ఈ సదుపాయాన్ని కల్పిస్తామని, క్రమంగా మరిన్ని ఆండ్రాయిడ్​ ఫోన్లకు విస్తరిస్తామని వెల్లడించింది.

వ్యక్తుల ఛాతీలో సూక్ష్మ కదలకలను గుర్తించడం ద్వారా శ్వాసక్రియా రేటును ఈ ఫీచర్​ గుర్తిస్తుంది. స్మార్ట్​ఫోన్​ కెమెరాతో పాటు 'ఆప్టికల్​ ఫ్లో' అనే కంప్యూటర్​ విజన్​ సాంకేతికత ఇందుకు దోహదపడతాయి. ఇక వ్యక్తుల వేలి కొనల్లో రంగుల మార్పును గుర్తించడం ద్వారా హృదయ స్పందనల వేగాన్ని గూగుల్​ ఫిట్​ పసిగడుతుంది.

​ఇదీ చూడండి:మాకు కరోనా టీకా అవసరం లేదు!

ABOUT THE AUTHOR

...view details