ఆరోగ్యకరమైన వ్యక్తులు కరోనా టీకా పొందాలంటే.. 2022వరకు వేచిచూడక తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. ఆరోగ్య కార్యకర్తలు, కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉండేవారికి అధిక ప్రాధాన్యం ఉండే నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ వ్యాఖ్యలు చేసింది.
2021 నాటికి కనీసం ఒక సమర్థవంతమైన వ్యాక్సిన్ బయటకు వస్తుందని.. అయితే అది తక్కువ సంఖ్యల్లోనే అందుబాటులో ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వానినాథన్ తెలిపారు.
"ఆరోగ్య కార్యకర్తలు, వైరస్ ముప్పు ఎక్కువగా ఉండే వారికి తొలుత వ్యాక్సిన్ ఇవ్వాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు బయటకువస్తాయి. అయితే నా వరకు.. ఆరోగ్యంగా ఉండేవారు టీకా తీసుకునేందుకు 2022వరకు వేచి చూడాల్సిందే."