తెలంగాణ

telangana

ETV Bharat / international

2 కార్లు ఢీ.. ఏడుగురు చిన్నారులు సజీవదహనం - కాలిఫోర్నియాలో రోడ్డు ప్రమాదం

అమెరికా కాలిఫోర్నియాలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొని మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ కారులో మంటలు చెలరేగి అందులో ఉన్న ఏడుగురు చిన్నారులు, ఓ మహిళ సజీవ దహనమయ్యారు.

Head-on crash
ఘోర రోడ్డు ప్రమాదం

By

Published : Jan 3, 2021, 9:47 AM IST

అమెరికాలోని సెంట్రల్​ కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో ఓ కారులో మంటలు చెలరేగి డ్రైవర్​ సహా ఏడుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. మరో కారు చోదకుడూ ప్రాణాలు కోల్పోయాడు.

ప్రమాదంలో మరణించిన చిన్నారులు రెండు కుటుంబాలకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. వారంతా 6-15 ఏళ్ల లోపు వారేనని వెల్లడించారు. కొత్త సంవత్సరం రోజున రాత్రి 8 గంటల ప్రాంతంలో అవెనల్​, కోలింగా మధ్య రాష్ట్ర రహదారి 33పై ప్రమాదం జరిగినట్లు ఫ్రెస్నో నగర ప్రమాదాల నివారణ కార్యాలయం, కాలిఫోర్నయ హైవే పేట్రోల్​ విభాగం తెలిపింది.

ఫోర్డ్​ కారులో చిన్నారులతో కలిసి ఓ మహిళ వెళుతుండగా అవెనల్​ సమీపంలో రోడ్డుపై కారు నిలిచిపోయింది. మరోవైపు నుంచి వస్తోన్న డాడ్జ్​ కారు అదుపుతప్పి.. డివైడర్​ను​ దాటుకొని వారి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఫోర్డ్​ కారులో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న చిన్నారులతో పాటు మహిళ సజీవదహనం అయ్యారు.

ఇదీ చూడండి:'నేల కుంగిపోతోంది.. జాగ్రత్త'

ABOUT THE AUTHOR

...view details