తెలంగాణ

telangana

ETV Bharat / international

గేమ్​ ఆఫ్​ రైట్స్​: ట్రంప్​ వర్సెస్​ హెచ్​బీఓ - trump

ప్రముఖ టెలివిజన్​ సంస్థ హెచ్​బీఓ... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ట్వీట్​కు మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సంస్థ ప్రసారం చేస్తున్న ప్రముఖ వెబ్​ సిరీస్​ 'గేమ్ ఆఫ్​ థ్రోన్స్​'​ మీమ్​తో ట్రంప్​ ట్వీట్​ చేయడమే ఇందుకు కారణం.

గేమ్​ ఆఫ్​ రైట్స్​: ట్రంప్​ వర్సెస్​ హెచ్​బీఓ

By

Published : Apr 19, 2019, 8:32 PM IST

ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన 'గేమ్​ ఆఫ్​ థ్రోన్స్'​ సిరీస్​ మీమ్స్​ను ఉపయోగించకూడదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను మరోసారి కోరింది హెచ్​బీఓ సంస్థ. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం లేదని యూఎస్​ అటార్నీ జనరల్​ బిల్​ బార్​ పునరుద్ఘాటించారు. ఈ ప్రకటన నేపథ్యంలో గేమ్​ ఆఫ్ థ్రోన్స్ మీమ్​తో ఒక ట్వీట్​ చేశారు ట్రంప్​.

"కుట్ర లేదు, ఆటంకం లేదు. ద్వేషించేవారికి, లెఫ్ట్​ డెమొక్రాట్లకు ఆట ముగిసింది" అని గేమ్​ ఆఫ్ థ్రోన్స్​ ఫాంట్​తో ఆంగ్లంలో రాసి ఉన్న ఫోటోను పోస్ట్​ చేశారు.
ట్రంప్ ట్వీట్​పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ... ఓ ప్రకటన విడుదల చేసింది హెచ్​బీఓ సంస్థ.

"గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​పై ఉన్న ఆసక్తిని మేము అర్థం చేసుకోగలం. ఈ మధ్యే ఫైనల్​ సిరీస్​ విడుదలైంది. అయినప్పటికీ మా మేధో సంపత్తిని రాజకీయాలకు వినియోగించకూడదనేదే మా ఉద్దేశం."
- హెచ్​బీఓ సంస్థ

ట్రంప్​... గతంలోనూ

గతేడాది నవంబర్​లోనూ గేమ్ ఆఫ్ థ్రోన్స్​ మీమ్​తో ఓ ట్వీట్​ చేశారు ట్రంప్​. అప్పుడే హెచ్​బీఓ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. షో నినాదాలను దుర్వినియోగం చేయొద్దని ట్రంప్​ను కోరింది.

ఇదీ చూడండి : టైగర్​వుడ్స్​పై బెట్... మిలియన్​ డాలర్ల హిట్​

ABOUT THE AUTHOR

...view details