ఆమెరికాలో ద్వేషపూరిత నేరాలు.. దశాబ్దకాలంలోనే అత్యధిక స్థాయికి చేరినట్టు ఓ ఎఫ్బీఐ నివేదిక పేర్కొంది. దీనితో పాటు ద్వేషపూరిత హత్యలు కూడా రికార్డు స్థాయిలో నమోదైనట్టు వెల్లడించింది.
గతేడాది మొత్తం మీద 7,314 ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయి. 2018లో ఆ సంఖ్య 7,120. 2019లో 51 హత్యలు వెలుగుచూశాయి. ఈ తరహా డేటాను సేకరించడం మొదలుపెట్టిన నాటి(1990 దశాబ్దం) నుంచి ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఓ వ్యక్తి జాతి, మతం, లిగంతో పాటు ఇతర అంశాలపై వ్యతిరేకతతో ఈ తరహా నేరాలు జరుగుతున్నట్టు ఎఫ్బీఐ వార్షిక నివేదిక పేర్కొంది.
మతం ఆధారంగా జరిగిన నేరాల్లో 7శాతం పెరుగుదల నమోదైంది. అయితే 2018(1,943)తో పోల్చితే ఆఫ్రో అమెరికన్లపై నేరాలు.. 2019(1,930)లో కొంతమేర తగ్గాయని ఎఫ్బీఐ నివేదిక స్పష్టం చేస్తోంది.