తెలంగాణ

telangana

ETV Bharat / international

బైడెన్​ ప్రభుత్వంలో కమల భర్త ఏం చేస్తారంటే.. - అమెరికా రెండో జెంటిల్​మన్

వచ్చే ఏడాది కొలువుదీరనున్న జో బైడెన్ ప్రభుత్వంలో ప్రథమ మహిళ జిల్​ బైడెన్​.. తన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించనున్నారు. అయితే, ఉపాధ్యక్షురాలు కమల హారిస్ భర్త డౌగ్​ ఎమాఫ్.. తన న్యాయవాద వృత్తి వదిలి పరిపాలనలో భార్యకు సహకరించాలని నిర్ణయం తీసుకున్నారు.

US-HARRIS-HUSBAND
కమల

By

Published : Nov 11, 2020, 12:48 PM IST

అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన బైడెన్- హారిస్ ద్వయం వచ్చే ఏడాది జనవరి 20న శ్వేతసౌధంలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో వాళ్ల జీవిత భాగస్వాములపై చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రథమ మహిళ జిల్​ బైడెన్ తన బోధనను కొనసాగిస్తారని.. సెకండ్ జెంటిల్​మన్​ డౌగ్​ ఎమాఫ్ తన భార్యకు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

శ్వేతసౌధంలో ప్రవేశించాక డౌగ్​ ఎమాఫ్​ తన న్యాయవాద వృత్తిని వదిలేయాలని నిర్ణయించుకున్నారని ఆయన ప్రతినిధి తెలిపారు. శ్వేతసౌధంలో ఉపాధ్యక్షురాలి భర్తగా తన పాత్రపై దృష్టి సారిస్తారని స్పష్టం చేశారు. పాలనలో హారిస్​కు సహకరించేందుకు డౌగ్​ ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇప్పటికే అధికార బదిలీ​ బృందంతో కలిసి పనిచేస్తున్నారని వెల్లడించారు.

ప్రముఖ న్యాయవాదిగా..

దక్షిణ కాలిఫోర్నియాలో హైప్రొఫైల్ ఎంటర్​టైన్​మెంట్ న్యాయవాదిగా డౌగ్​కు మంచి పేరుంది. హారిస్​ ప్రచారంలో డౌగ్​ కీలకంగా పనిచేశారు. ప్రైమరీల్లోనూ హారిస్​కు నామినేషన్​ లభించినప్పుడు డౌగ్​ చాలా కృషి చేశారు. హారిస్​కు డౌగ్​ 'రహస్య ఆయుధం' అంటూ మీడియాలోనూ కథనాలు వచ్చాయి.

భార్యకు అభినందనలు..

ఉపాధ్యక్షురాలిగా హారిస్‌ గెలుపొందారన్న వార్తలపై డౌగ్​.. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ''ప్రేమపూర్వక అభినందనలు'' అంటూ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్‌ చేశారు. హారిస్‌ ఉపాధ్యక్షురాలిగా గెలుపొందడంపై చాలా గర్వంగా ఉంది అని చెబుతూ ఆమెను కౌగిలించుకున్న ఫొటోను షేర్‌ చేశారు. కమలా హారిస్‌ కూడా తన ఇన్​స్టా ఫాలోవర్స్‌కు డౌగ్​ను పరిచయం చేశారు.

ఇదీ చూడండి:బైడెన్​ సమీక్షా బృందాల్లో 20 మంది భారతీయులు

ABOUT THE AUTHOR

...view details