అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో అమెరికా ఉగ్రవ్యతిరేక దళాలు జరిపిన ఆపరేషన్లో హమ్జాను మట్టుబెట్టినట్లు స్పష్టంచేశారు.
అయితే ఆపరేషన్ జరిగిన కచ్చితమైన ప్రాంతాన్ని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొనలేదు.