తెలంగాణ

telangana

ETV Bharat / international

టీకా పంపిణీలో అమెరికా రికార్డు - సగం జనాభాకు వాక్సిన్​ అందించిన అమెరికా

తమ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించే కార్యక్రమంలో కీలక మైలురాయిని చేరుకుంది అమెరికా. దేశ జనాభాలో సగం మంది పెద్దలకు కరోనా వ్యాక్సిన్‌ అందజేసినట్లు వెల్లడించింది. 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న 13 కోట్ల మందికి కరోనా టీకా ఇచ్చినట్లు తెలిపింది.

vaccine
టీకా

By

Published : Apr 19, 2021, 9:17 AM IST

కరోనా మహమ్మారిపై యుద్ధం ప్రకటించిన అమెరికా.. తమ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించే కార్యక్రమంలో కీలక మైలురాయిని చేరుకుంది. దేశ జనాభాలో సగం మంది పెద్దలకు కరోనా వ్యాక్సిన్‌ అందజేసినట్లు వెల్లడించింది. 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న 13 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందించామని తెలిపింది.

ఇది దేశ జనాభాలో 50.4 శాతమని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. వీరిలో 32.5 శాతం మందికి 2 సార్లు టీకాలు వేశామని పేర్కొంది. ఈ వారంలోనే జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కరోనా వ్యాక్సిన్‌ను తిరిగి వినియోగించే అవకాశం ఉందని అమెరికా తెలిపింది. అరుదైన రక్తం గడ్డకట్టే సమస్యలు వస్తున్నాయన్న అభియోగాల మధ్య అమెరికా ఈ టీకాను నిలిపేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details