హైతీ అధ్యక్షుడు జొవెనెల్ మోయిసే దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లోనే ఆయనపై దుండగులు దాడి చేసి చంపేశారు. హైతీ ప్రథమ మహిళ, మోయిసే భార్యపైనా దాడి జరిగింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆస్పత్రికి తరలించారు.
గుర్తు తెలియని దుండగులు కొందరు మోయిసే వ్యక్తిగత నివాసంలోకి చొరబడి.. ఆయనను హత్య చేశారని మధ్యంతర ప్రధాని క్లాడె జోసెఫ్ తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. దీనిని అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని చెప్పారు.