కరేబియన్ ద్వీప దేశం హైతీలో శనివారం సంభవించిన భారీ భూకంపం కారణంగా ఇప్పటివరకు1297 మంది మరణించారు. మరో 5700 మందికిపైగా గాయపడగా.. పలువురు గల్లంతైనట్లు ఆ దేశ పౌర రక్షణ శాఖ తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పేర్కొంది. శనివారం సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్‌స్కేలుపై 7.2గా నమోదైంది. శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో ఉండే అవకాశం ఉన్నందున.. రెస్క్యూ సిబ్బంది వారి కోసం వెతుకుతున్నారు.
హైతీ భూకంపం- 1297కు చేరిన మృతులు - హైతీ భూకంప తీవ్రత
కరీబియన్ దేశం హైతీలో భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 1297కు పెరిగింది. ఈ మేరకు ఆ దేశ రక్షణ శాఖ పేర్కొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
haiti
ఇక మళ్లీ భూకంపం సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు వీధుల్లోకి పరుగెత్తారు. కూలిన ఇళ్లు, హోటళ్లు, ఇతర నిర్మాణాల శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయం చేస్తున్నారు.
ఇవీ చదవండి:
Last Updated : Aug 16, 2021, 7:09 AM IST