హెచ్-1బీ వీసాల కోసం ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమలుకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు అమెరికా ఇమిగ్రేషన్ సంస్థ తెలిపింది. ప్రయోగాత్మకంగా దీన్ని పరీక్షించినట్లు వివరించింది.
హెచ్-1బీ వీసాలకు ఇక ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ - electronic registration process for h1b
హెచ్-1బీ వీసాల కోసం కంపెనీల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత పటిష్ఠంగా మారుస్తోంది అమెరికా ఇమిగ్రేషన్ సంస్థ. ఇందులో భాగంగా 2021 సీజన్ కోసం ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను తీసుకురానుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్లు పేర్కొంది.
![హెచ్-1బీ వీసాలకు ఇక ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ VISA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5304278-thumbnail-3x2-visa.jpg)
హెచ్-1బీ వీసాలకు ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్
2021 సీజన్‌కు సంబంధించి ఈ విధానం అమలు చేయనున్నట్లు తెలిపింది. వీటికి దరఖాస్తులను వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి స్వీకరించనున్నట్లు పేర్కొంది. 2021 సీజన్‌లో హెచ్-1బీ వీసాల కింద విదేశీ ఉద్యోగులను నియమించుకోవాలనుకునే కంపెనీలు 2020 మార్చి 1 నుంచి 20 వరకూ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి:పాక్ అమ్మాయిలను వధువు ముసుగులో చైనాకు విక్రయం..!