విదేశీయులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు ఇచ్చే హెచ్-1బీ వీసాల.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 9 నుంచి ప్రారంభం కానున్నట్లు అగ్రరాజ్య పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ శాఖ తెలిపింది. లాటరీ పద్దతి ద్వారా ఎంపికైన అభ్యర్థుల వివరాలను మార్చి 31 నాటికి ప్రకటిస్తామని వివరించింది. అక్టోబర్ 1 నుంచి ఉద్యోగం ప్రారంభించవచ్చని పేర్కొంది.
లాటరీ విధానం కొనసాగింపు
మార్చి 9న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 25 వరకు ఉంటుందని అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ పేర్కొంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో తీసుకొచ్చిన హెచ్-1బీ వీసా నిబంధనల మార్పుల అమలును వాయిదా వేస్తున్నట్లు నూతన అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే తెలిపారు. లాటరీ విధానాన్ని పొడిగించనున్నట్లు వివరించారు.
ఏటా 65 వేల మందికి..