తెలంగాణ

telangana

By

Published : Sep 20, 2019, 10:29 AM IST

Updated : Oct 1, 2019, 7:28 AM IST

ETV Bharat / international

శ్వేతసౌధం సమీపంలో గన్​ఫైర్​..ఒకరు మృతి

అమెరికా వాషింగ్టన్​లోని వైట్​హౌస్ సమీపంలో గురువారం రాత్రి దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

శ్వేతసౌధం సమీపంలో కాల్పులు కలకలం!

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నగర వీధుల్లో గుర్తు తెలియని దుండగులు గురువారం రాత్రి కాల్పులకు తెగబడ్డారు. శ్వేతసౌధం సమీపంలో ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

గురువారం రాత్రి 10:06 గంటలకు శ్వేతసౌధానికి మూడు కిలోమీటర్ల దూరంలో కొలంబియా రోడ్డు వీధిలో ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: ట్రంప్-మోదీ భారీ బహిరంగ సభకు తుపాను ముప్పు!

Last Updated : Oct 1, 2019, 7:28 AM IST

ABOUT THE AUTHOR

...view details