తెలంగాణ

telangana

ETV Bharat / international

పుట్టినరోజున తోటి విద్యార్థులపై కాల్పులు- ఇద్దరు మృతి - california gunfire news

అమెరికా కాలిఫోర్నియాలోని ఓ పాఠశాలలో విద్యార్థి కాల్పులకు పాల్పడ్డాడు. తన పుట్టినరోజు నాడు సహ విద్యార్థులపై తుపాకీతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

పుట్టినరోజున తోటి విద్యార్థులపై కాల్పులు

By

Published : Nov 15, 2019, 10:44 AM IST

Updated : Nov 15, 2019, 1:37 PM IST

పుట్టినరోజున తోటి విద్యార్థులపై కాల్పులు

అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం రేపాయి. దక్షిణ కాలిఫోర్నియాలోని సాగస్ ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థి తన పుట్టిన రోజు నాడు తోటి విద్యార్థులపై విచక్షణారహితంగా తుపాకీతో దాడికి పాల్పడ్డాడు. అనంతరం తనను తాను తలపై కాల్చుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తి తీవ్రంగా గాయపడగా... పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని, ఆస్పత్రికి తరలించారు.

స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7:30 గంటలకు ఈ ఘటన జరిగింది.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు..

పాఠశాలలో కాల్పుల శబ్దం వినపడాగానే విద్యార్థులు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. స్థానికులు వారికి ఆశ్రయమిచ్చారు. ఘటన గురించి తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు పరుగులు తీశారు.

ఇదీ చూడండి: 'ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడదాం'

Last Updated : Nov 15, 2019, 1:37 PM IST

ABOUT THE AUTHOR

...view details