తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​కు నేపాల్​ ప్రధాని కీలక సందేశం - స్వాతంత్ర దినోత్సవం 2020

భారత్​ 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో శుభాకాంక్షలు తెలిపారు. రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య స్నేహబంధం దృఢమైనదని ఉద్ఘాటించారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్​ కూడా అభినందనలు తెలిపారు.

Iday greetings
నేపాల్​ ప్రధాని

By

Published : Aug 15, 2020, 11:13 AM IST

Updated : Aug 15, 2020, 12:31 PM IST

భారత్​- అమెరికా సన్నిహిత మిత్ర దేశాలని, ప్రజాస్వామ్య సంప్రదాయాలను పంచుకుంటాయని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఉద్ఘాటించారు. 74వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు పాంపియో.

"అమెరికా ప్రభుత్వం, ప్రజల తరఫున భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. భారత్, అమెరికా మధ్య స్నేహబంధం చాలా దృఢమైనది. ప్రజాస్వామ్య దేశాలుగా ఇద్దరి మంచి అవగాహన ఉంది. క్రమంగా ఈ బంధం ప్రపంచ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఎదిగింది. 21 శతాబ్దంలో ప్రపంచ భద్రత, శ్రేయస్సులో ఇద్దరి సహకారం కీలకంగా మారింది."

- మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి

మోదీకి ఓలి శుభాకాంక్షలు..

పంద్రాగస్టు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో పాటు భారత ప్రజలకు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజల అభివృద్ధి, శ్రేయస్సును కాంక్షిస్తున్నట్లు చెప్పారు.

రెండు దేశాల మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఓలి సందేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆస్ట్రేలియా ప్రధాని..

"ప్రధాని నరేంద్రమోదీకి, భారత ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు. భారత్, ఆస్ట్రేలియా మధ్య లోతైన స్నేహం, భరోసా, గౌరవం విలువలపై భాగస్వామ్యం స్థాపితమైంది." అని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు.

ఇజ్రాయెల్ రాయబారి..

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇజ్రాయెల్ రాయబారి రోన్​ మల్కా భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో శాంతి, సామరస్యం వర్థిల్లాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి:'ఆత్మనిర్భర శంఖారావంతో ప్రపంచానికి మన శక్తిని చాటుదాం'

Last Updated : Aug 15, 2020, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details