కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక సాయం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పలు రాష్ట్రాల గవర్నర్లు, మేయర్లతో శ్వేతసౌధంలో భేటీ అయ్యారు. 1.9 ట్రిలియన్ డాలర్ల కరోనా ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా 350 బిలియన్ డాలర్లు రాష్ట్రాలకు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
ఇంత మొత్తం ఆర్థిక సాయం అందించడం సరైన నిర్ణయం కాదని కాంగ్రెస్‌లోని రిపబ్లికన్లు నిరాకరించినా.. కొంత మంది గవర్నర్లు, మేయర్లు ఇందుకు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు గతంలో ఇచ్చిన నిధులే ఇప్పటివరకు ఖర్చు కాలేదని కొందరు రిపబ్లికన్ నేతలు ఆరోపించారు.