అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార యాప్‌ను ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. తమ విధానాలను ఈ యాప్ ఉల్లంఘించినందున గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.
యాప్ లోడ్ కావట్లేదని, అందులోని సమాచారం తొలగిపోయినట్లు ఆండ్రాయిడ్ పోలీసులు గుర్తించారు. దాంతో ఈ యాప్‌పై గూగుల్ వేటు వేసింది. గతేడాది నవంబర్‌లో ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ వేదికల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. కానీ, ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్లు చేయలేదు. అక్టోబర్ 30 నుంచి ప్లే స్టోర్ వెర్షన్ అప్డేట్ కాలేదు.
"ట్రంప్ 2020 క్యాంపెయిన్ యాప్ ఇటీవల పని చేయడం ఆగిపోయింది. ఈ విషయాన్ని యాప్ డెవలపర్ల దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లాం. గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే యాప్‌లు కనీస స్థాయిలోనైనా.. పని చేస్తాయని ప్రజలు నమ్ముతారు. పని చేయని వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగిస్తాం."