కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలోని ఇతర దేశాలకు చెందిన విద్యార్థులంతా సొంత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తీసుకొచ్చిన నూతన నిబంధనను అక్కడి విద్యాసంస్థలు, ఐటీ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ విధానాన్ని రద్దు చేయాలని ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఇప్పుడు ఆ జాబితాలో గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ ఐటీ సంస్థలు చేరాయి.
విదేశీ విద్యార్థులను వెనక్కి పంపితే అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ సహా ఇతర ప్రముఖ సంస్థలు కోర్టుకు తెలిపాయి. ఈ విద్యార్థులంతా అగ్రరాజ్య ఆర్థిక వృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నారని పేర్కొన్నాయి. వారిని వెనక్కి పంపిస్తే తిరిగి అమెరికాకు రారని, ఇతర దేశాలకు వెళ్లి అమెరికాకు పోటీ ఇచ్చే పరిస్థితి వస్తుందని వివరించాయి.
అమెరికాలోని కీలక వ్యాపార, ఐటీ రంగాలు విదేశీ విద్యార్థుల ద్వారా ప్రయోజనం పొందుతున్నాయని ప్రముఖ కంపెనీలు కోర్టుకు చెప్పాయి. కొత్త నిబంధన అమల్లోకి వస్తే ఉద్యోగ నియామకాలు, శిక్షణకు సంబంధించి సంస్థల ప్రణాళికలకు మార్పులు చేసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నాయి.
'2018-19 విద్యా సంవత్సరంలో 10 లక్షల మందికిపైగా విదేశీయులు అమెరికాలోని విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందారు. అమెరికాకు ఆర్థికంగా 41 బిలియన్ డాలర్ల మేర ప్రయోజనం చేకూరింది. 458,290 ఉద్యోగాల్లో సహకరించారు.' అని దిగ్గజ ఐటీ సంస్థలు కోర్టుకు వివరించాయి. విదేశీ విద్యార్థులు దేశం వీడాలనే నిబంధనను ఎత్తివేయాలని కోరాయి.
200 విద్యాసంస్థల మద్దతు..